Thursday, September 4, 2008

అన్నమయ్య రచనలు

అన్నమయ్య 32,000 సంకీర్తనలతో పాటు
సంస్క్రత వేంకటాచల మహాత్మ్యం
సంకీర్తనా లక్షణం
ద్విపద రామాయణం
12 తెలుగు శతకాలు
శృంగార మంజరి
వంటి "నానా ప్రబంధములను" రచించినట్టు చిన్నన్న రచించిన ద్విపద వల్ల తెలుస్తుంది.
ఈ సృష్టిలోని మానవుడి 36 తత్త్వాలకు ప్రతీకగా 36,000 రచనలు అన్నమయ్య చేయాలనుకున్నాడనీ, వేంకటాచల మహాత్మ్యం, రామాయణం, సంకీర్తనా లక్షణం, పదకొండు శతకాలూ కలిపి నాలుగు వేలు అయినవనీ, మిగిలిన ముప్పైరెండువేలూ సంకీర్తనలుగా రచించాడనీ చెప్పే ఒక కథ జనశృతిలో ఉంది.
అన్నమయ్య రచనలలో వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తనా లక్షణం, 11 శతకాలు ఇప్పుడు లభించటం లేదు. లభించిన శతకంలోనూ వేంకటేశ్వర ముద్రతో అలమేలుమంగను స్తుతిస్తున్నట్టుగా పద్యాలు ఉండటంతో ఈ శతకం అన్నమయ్య విరచితమా కాదా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.